Sunday, February 19, 2012

siddardha's-love-failure-success-meet


ఇప్పుడు నా వయస్సు ఎంతంటే..సిద్దార్ధ


హీరోగా, నిర్మాతగా... ఇకపై ఇలాంటి నాణ్యమైన చిత్రాలు మరెన్నో తీస్తానన్న నమ్మకముంది. ఇప్పుడు నా వయసు 32యేళ్లు. 'లవ్‌ ఫెయిల్యూర్‌' చిత్రాన్ని హిందీలోకి కూడా తీసుకెళ్లే ఆలోచన ఉంది అంటున్నారు సిద్దార్ధ. ఆయన హీరోగా చేస్తూ నిర్మించిన చిత్రం 'లవ్‌ ఫెయిల్యూర్‌'మొన్న శుక్రవారం విడుదలైంది. అమలాపాల్‌ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రానికి బాలాజిమోహన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సక్సెస్ మీట్ ని సిద్దార్ధ నిర్వహించి ఈ రకంగా స్పందించాడు. అలాగే..విడుదలైన తొలి రోజునే... సినిమా చాలా బాగుందని ప్రేక్షకులు నాకు చెప్పడం 'బొమ్మరిల్లు' తర్వాత 'లవ్‌ ఫెయిల్యూర్‌'కే జరిగింది అన్నారు సిద్ధార్థ్‌.'ఒక హీరో గానే కాకుండా... ఒక విజయవంతమైన నిర్మాతగానూ నన్ను నిలబెట్టిన చిత్రమిది. పదేళ్ల కాలంలో ఏమేం నేర్చుకొన్నానో అదంతా ఈ సినిమాకోసం ఉపయోగించాను.

నిర్మాణవ్యయం, చిత్రీకరణ రోజులు... ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాను. అందుకే ఇలాంటి ఒక ప్రయోగాత్మక చిత్రం నిర్మించినా విడుదలకు ముందే లాభాల్లో ఉన్నాను. కథలో కొత్తదనం, దానిపై నాకున్న నమ్మకంతోనే ఈ చిత్రాన్ని సొంతంగా విడుదల చేశాను. వ్యతిరేక భావాలున్న పేరుతో సినిమా తెరకెక్కించి విజయాన్ని అందుకోవడం అన్నిటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చింది. కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. దర్శకుడిగా బాలాజిమోహన్‌కి ఇది తొలి చిత్రమే అయినా... ఎంచుకొన్న కథాంశం, దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం చాలా బాగుంది. అమలాపాల్‌ నటన, తమన్‌ సంగీతం, నీరవ్‌షా కెమెరా పనితనం ఈ చిత్రానికి కలిసొచ్చాయి అన్నారు.

No comments:

Post a Comment